Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
ముందస్తు జాగ్రత్తలతో ప్రమాదాలను నివారించాలని సింగరేణి డైరెక్టర్లు అధికారులకు సూచించారు. శుక్రవారం స్థానిక జీఎం కార్యాలయంలో సింగరేణి డైరెక్టర్లు కె.చంద్రశేఖర్‌రావు, ఎన్.బాలరామ్ ఐఆర్ఎస్లు మణుగూరు సింగరేణి అధికారులతో వీడియో కార్పెరెన్స్లో పాల్గొన్నారు. జీఎం జక్కం రమేష్ ఆధ్వర్యంలో ఈ వీడియో కార్పెరెన్స్ల్లో ఏజెంట్లు, మేనేజర్లు, రక్షణాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు పలు సూచనలు తెలియజేశారు. యాజమాన్యం కార్మికుల రక్షణే ప్రథమంగా రక్షణ సుత్రాలను రూపొందించడం జరిగిందన్నారు. వీటిని పాటించాల్సిన బాధ్యత కార్మికులతో పాటు పరివేక్షించే అధికారులపై వుందన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు పాల్గొన్నారు.