Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
మండలంలోని వేపలగడ్డ, నకిరిపేట గ్రామ పంచాయతీలలో కరోనా బాధిత కుటుంబాలకు భట్టా మల్లయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో మాజీ జెడ్పీటీసీ భట్టా విజయగాంధీ చేతులమీదుగా నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కుంజా చిన్నబ్బాయి, చర్పా వెంకటేశ్వర్లు, ట్రస్ట్ సెక్రటరీ తాటి సత్యనారాయణ, ఉపసర్పంచ్ వెంకన్న, మాజీ సర్పంచ్ బోర్రా శ్రీను, ట్రస్ట్ సభ్యులు, అశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
11వ వేతన కమిటీ ఏర్పాటుకు కేంద్రం అనుమతి : బీఎంఎస్
నవతెలంగాణ-మణుగూరు
11వ వేతన కమిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని భారతీయ మజ్దూర్ సంఫ్‌ు కేంద్ర ఉపాధ్యక్షులు వీరమనేని రవీందర్ రావు తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేం లో ఆయన పాల్గొని మాట్లాడుతూ... దేశ వ్యాప్తం గా బొగ్గు పరిశ్రమల కార్మికులకు కోలిండియా, సింగరేణి కార్మికులకు తదితర ఉద్యోగులకు 11వ వేతన కమిటీ ఏర్పాటు కోసం కేంద్ర అనుమతి ఇచ్చిందన్నారు. బీసీసీఐ 11వ వేతన కమిటీ ఏర్పాటు చేసుకోనేందుకు అనుమతి ఇస్తూ మినిస్ట్రీ ఆప్ కోడ్ లేఖ పంపిందన్నారు.
రెమెడిసివర్ ఇంజక్షన్ల మాయంపై శాఖాపరమైన చర్యలు
అ ఒక వైద్యుని తొలగింపు
అ ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్, ఫార్మసిస్ట్‌ల సస్పెన్షన్
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రెమెడిసివర్ ఇంజక్షన్లు మాయమైన వ్యవహారంలో వైద్య ఆరోగ్య శాఖ శాఖా పరమైన చర్యలు శుక్రవారం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన ఈ వ్యవహారంపై వైద్య ఆరోగ్య శాఖ ఈ చర్యలకు పూనుకుంది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సూపర్డెంట్ యం.ముక్కంటేశ్వర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యులుగా పనిచేస్తున్న శివరామకృష్ణ ప్రసాద్‌ను (యన్ హెచ్ఎం కాంట్రాక్ట్) తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ చావా.యుగంధర్, ఫార్మాసిస్ట్ శ్రీనివాస్‌లను సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రాథమిక వైద్య శాలలో టెస్టులు పెంచండి
నవతెలంగాణ-టేకులపల్లి
మండలంలోని సులా నగర్ ప్రాథమిక వైద్యశాలలో కరోనా టెస్టులు పెంచాలని, వ్యాక్సిన్ అందరికీ వేయాలని ప్రగతిశీల యువజన సంఘం నాయకులు శుక్రవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టెస్టు కిట్ల కొరత వల్ల కేవలం రోజుకు 25 టెస్టులు చేయడం ద్వారా అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనంతరం తహసీల్దార్ కె.వి.శ్రీనివాస్ రావుకు వినతి పత్రం అందజేశారు. పీవైఎల్ జిల్లా కార్యదర్శి నోముల. భానుచందర్, మండల కార్యదర్శి సతీష్ తదితరులు కోరారు.
పరువు హత్య కుటుంబానికి న్యాయం చేయాలి
అ మాలమహానాడు జిల్లా అధ్యక్షులు కూరపాటి
నవతెంలగాణ-కొత్తగూడెం
రుద్రంపూర్‌లో గురువారం రాత్రి జరిగిన పరువు హత్య కుటుంబానికి న్యాయం చేయాలని మాలమహానాడు జిల్లా అధ్యక్షులు కూరపాటి రవీందర్ సింగరేణి సంస్థను డిమాండ్ చేశారు. సింగరేణి ఎస్టేట్ అధికారిని స్వప్న కారణంగా ఇంటి స్థలం, తండ్రి ఉద్యోగం కోల్పోతామనే, ఎస్టేట్ అధికారిని స్వప్న అతిగా వ్యవహరించడం వల్ల కక్షపూరితంగా ఇంటి ప్రహరీ గోడ కూల్చడం వల్ల షారోన్ బాలిక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు. బాదితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు జిల్లా కార్యదర్శి జెల్లా రాజేష్, సీరా చిరంజీవి, పట్టణ అధ్యక్షుడు చింటూ, ఆర్టీసీ బ్రహ్మం, ఆర్టీసీ భాస్కర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.