Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు, ప్రవేటు వాహనాల డ్రైవర్లకు, సెక్యూరిటీ గార్డులకు సింగరేణి ప్రాంతీయ వైద్యశాలలో కోవిడ్ నిర్ధారన పరీక్షలకు అవకాశం కల్పించాలని ఇప్టూ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం వివిధ పనిప్రదేశాల్లో జరిగిన అడ్డా మీటింగ్‌లో నాయకులు పాల్గొని మాట్లాడుతూ... మణుగూరు ఏరియా వివిధ గనుల్లో, డిపార్ట్మెంట్లో ఇతర ప్రవేటు కార్మికులకు అవకాశం కల్పించాలన్నారు. ఈ విషయంపై జీఎం జక్కం రమేష్‌కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏ.మంగీలాల్, యాకూబ్, రాజేష్, వెంకన్న, అక్బర్, పద్మ, కుమారి తదితరులు పాల్గొన్నారు.