Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అ షారోన్ కుటుంబానికి న్యాయం చేయాలి
- అ సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్కె.సాబీర్ పాషా
నవతెలంగాణ-కొత్తగూడెం
స్థల వివాదంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్ధిని, చుంచుపల్లి మండలం రుద్రంపూర్ నివాసి షారోన్ (17) మృతి సంఘటనపై సమగ్ర విచారణ జరిపి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా కోరారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆతస్పత్రికి తరలించిన షారోన్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం సంస్థ స్థలాల విషయంలో దురుసుగా ప్రవర్తించడం వల్లే ఇలాంటి సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి వై.శ్రీనివాసరెడ్డి, రుద్రంపూర్ సర్పంచ్ గుమ్మడి సాగర్, ఆర్టీసి ఈయు నాయకులు కందుల భాస్కర్, బిక్షపతి, తోట రాజు, నసీర్ తదితరులు ఉన్నారు.
సింగరేణి అధికారుల తీరు సరికాదు : కూనంనేని
సింగరేణి సంస్థకు ఉపయోగం పడని స్థలాల్లో పేదలు ఇండ్లు నిర్మించుకుంటే తప్పేమిటని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కునేంనేని సాంబశివరావు ప్రశ్నించారు. స్థల వివాదంలో మనస్తాపానికి గురై తనువు చాలించిన బాలిక షారోన్ మృతికి సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. స్థల విషయంలో పోలీసులకు, ఆర్టీసీ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడం వల్లే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. షారోన్ కుటుంబానికి న్యాయం చేయాలనీ కూనంనేని డిమాండ్ చేశారు.