Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
భారత స్వాతంత్రోద్యమంలో ధృవతార అల్లూరి సీతారామరాజు 97వ వర్ధంతిని పట్టణం, మండలంలో ఘనంగా శుక్రవారం నిర్వహించారు. పట్టణంలోని స్థానిక కార్యాలయంలో వివిధ ప్రాంతాలలో రాష్ట్ర కమిటీ సభ్యులు మధు, కొమరారంలో ఎన్డీ గ్రామ కమిటీ, డివిజన్ నాయకులు కామ్రేడ్ అజ్మీర బిచ్చ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వర్ధంతి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవా దుల కబంధహస్తాల నుండి విడిపించుటకు మన్యంలో అలుపెరుగని పోరు సల్పారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కామ్రేడ్స్ ప్రసాద్ శంకర్ సీహెచ్ రాములు, పాషా, సమ్మన్న, రాఘవులు, శ్రీను, శాంతారావు, మంగీలాల్, వెంకన్న, శ్రీను, తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.
దుమ్ముగూడెం : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 97వ వర్థంతి వేడుకలను శుక్రవారం ప్రగతిశీల యువజన సంఘం, ఎన్డీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వ హించారు. అడవిరామవరం గ్రామ ంలో సున్నం వీరభద్రం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎన్డి డివిజన్ నాయకులు సాయన్న సీతారామరాజు చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కన్నయ్య, రామిచిట్టి, బాబురావు తదితరులు ఉన్నారు.
టేకులపల్లి : బ్రిటీష్ ముష్కరులపై యుద్ధం ప్రకటించి దేశ విముక్తి కోసం తన నిండు ప్రాణాలర్పించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో నేటి విద్యార్థి-యువ తరం ఉద్యమించాలని ఎన్డీ మండల కార్యదర్శి కల్తీ వెంకటేశ్వర్లు, మండల నాయకులు జర్పుల సుంధర్, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు కాంపాటి మృధ్వీలు ప్రజలకు పిలుపునిచ్చారు. మండలంలో అల్లూరి సీతారామరాజు 97వ వర్ధంతి సందర్భంగా మన్యం వీరుడుకి పూలమాలలు వేసి శుక్రవారము నివాళులు అర్పించారు. పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండలం నాయకులు సనప కృష్ణ, ఇఫ్టూ మండల నాయకులు శంకరాచారి తదితరులు పాల్గొన్నారు.
చర్ల : రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు అని సీపీఐ(ఎం) నాయకులు కొండ చరణ్, కేవీపీఎస్ నాయకులు మచ్చా రామారావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సత్యనారాయణపురంలో అల్లూరి సీతారామరాజు 97వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. తొలుత అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కారం కన్నయ్య, శ్యామల వెంకట్, వినోద్ జంగం రాజు, అప్పన్న , నరసయ్య, నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.