Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
రోజురోజుకు పట్టణాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీన్ని అరికట్టడం కోసమే ప్రభుత్వం ఇంటింటి సర్వే కార్యక్రమం చేపట్టిందని గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షులు దిండిగాల రాజేందర్ అన్నారు. స్థానిక 7వ వార్డ్‌లో శుక్రవారం కరోనా నివారణ కోసం ఇంటి ఇంటికి తిరిగి సర్వే తీరును పరిశీలిస్తూ సర్వేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా లక్షణాలు ఉన్న వాళ్లు తమ పేరు నమోదు చేసుకుంటే మందులతో కూడా కిడ్స్ అందజేస్తారని అన్నారు. దీని మూలంగా ఆరోగ్యం కుదుట పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ నాగరాజు, ఆశ వర్కర్, అంగన్వాడీ టీచర్, రిసోర్స్ పర్సన్ పాల్గొన్నారు.
బూర్గంపాడు : బూర్గంపాడు పంచాయతీలోని గౌతమిపురం కాలనీలో ప్రభుత్వం చేపట్టిన ఇంటింట జ్వర సర్వే కార్యక్రమాన్ని సర్పంచ్ సిరిపురపు స్వప్న ప్రారంభించారు. ప్రతి ఇంటికి తిరిగి ప్రజలు ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కే.భగవాన్ రెడ్డి, ఎంపీడీఓ వివేక్ రాం, పంచాయతీ కార్యదర్శి కె.వెంకటేస్వర్లు, ఆశావర్కర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ఇంటింటి ఆరోగ్య సర్వేను ఎంపీడీఓ పి.ముత్యాలరావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన దుమ్ముగూడెం, సున్నంబట్టి, శ్రీనగర్ కాలనీలో వైద్య, అంగన్వాడీ సిబ్బంది నిర్వహిస్తున్న ఇంటింటి ఆరోగ్య సర్వే తీరును పరీశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సర్వే సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసు కోవడంతో పాటు ఎవరికైనా జ్వరం వంటి లక్షణాలు ఉంటే ఇంట్లో ఉండి వైద్యం తీసుకునే విదంగా ఐదు రోజులకు సరిపడా మందుల కిట్లు అందజేయడం జరుగుతుందన్నారు. దీని వలన కోవిడ్ 19 కేసులు అదుపులోకి వస్తాయన్నారు. సర్వేను పరీశీలించిన వారిలో దుమ్ముగూడెం వైద్యాధికారి బాలాజీ నాయక్ తదితరులు ఉన్నారు.
కాంట్రాక్ట్ కార్మికులకు ఉచిత వైద్యం,
వేతనాలతో కూడిన సెలవలు ప్రకటించాలి
నవతెలంగాణ-మణుగూరు
కోవిడ్-19 సెకండ్ వేవ్ సునామీల విరుచుకుపడుతుందని కాంట్రాక్ట్ కార్మికులకు బలికాకుండా వుండేందుకు ఉచిత వైద్యం, వేతనంతో కూడిన సెలవులు ప్రకటించాలని ఇప్టూ నాయకులు తెలిపారు. పనిప్రదేశాల్లో శానిటైజర్స్‌ను, మాస్క్‌లను అందించాలన్నారు. కరోనాతో మృతి చెందిన కార్మికులకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. అనంతరం ఏస్వోటు జీఎం లలిత్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో ఆర్.మధుసూదన్‌రెడ్డి, జానయ్య, ఎండి.గౌష్ తదితరులు పాల్గొన్నారు.
మృతదేహాలకు నివాళులు ....
నవతెలంగాణ-టేకులపల్లి
మండలంలోని సులానగర్ గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన మృతదేహాలకు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్, జిల్లా పరిషత్ చైర్మెన్ కోరం కనకయ్యలు పూల మాల వేసి నివాళులర్పించారు. సులానగర్ గ్రామానికి చెందిన బల్లెం శాంతమ్మ (70), బల్లెం కాంతమ్మ (68) గత కొన్ని నెలల నుండి అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం ఇరువురు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.