Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వినతి పత్రం అందజేస్తున్న నాయకులు
నవతెలంగాణ-కొత్తగూడెం
స్పాంజ్ ఐరన్ కర్మాగారం ప్రైవేటు వారికి లీజ్‌కు ఇవ్వడాన్ని సీపీఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ముందు లీజు, ఆ తర్వాత ప్రైవేటు పరం చేయాలనేది ఎన్ఎమ్డీసీ కుట్రలో భాగంగా ఉందని సీపీఐ(ఎం) అభిప్రాయపడుతుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. శుక్రవారం స్పాంజ్ ఐరన్ కర్మాగారంకు చెందిన ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ సంఘాల బాధ్యులు సీపీఐ(ఎం) జిల్లా కార్యలయంలో వచ్చి తమ ఫ్యాక్టరి రక్షణకు తోడ్పాటు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తు నాయకులకు మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా కనకయ్య, కార్యదర్శివర్గ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడారు. 2004లో ఫ్యాక్టరి నష్టాల్లో ఉందనే పేరుతో మూసివేతకు ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం), ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేసామన్నారు. ఆనాటీ భద్రాచలం పార్లమెంట్ సభ్యులు మిడియం బాబురావు, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య నేతృత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రిప్రజెంటేషన్స్ ఇవ్వటం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో కార్మికవర్గం ఐక్యంగా చట్టపరమైన పోరాటాలు చేసి కోర్టు జోక్యంతో ప్రభుత్వ ఆలోచనని తిప్పికొట్టడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎన్ఎమ్డీసీ ఇచ్చిన హామీలను అమలు పర్చకుండా స్పాంజ్ ఐరన్ కర్మాగారం ప్రభుత్వ రంగం నుండి తొలగించేందుకు మరో మారు లీజ్ నాటకం పేరుతో ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్న ఈ ప్రయాత్ననాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.
స్పాంజ్ ఐరన్ 1980లో ఆసియా ఖండంలోనే మొదటి యూనిట్ యులిడో (యూఎల్ఐడిఓ) టెక్నాలజీతో పాల్వంచలో ప్రారంభమైందని తెలిపారు. తర్వాత 1986లో ఇండియన్ టెక్నాలజీతో 2వ యూనిట్ ప్రారంభమైనది. సింగరేణిలో బొగ్గు, కెటిపిఎస్‌లో పవర్, కిన్నెరసానిలో నీరు, బయ్యారంలో ఐరన్ ఓర్, పాల్వంచలో అవసరమైన భూమి ఉండడం వల్ల పాల్వంచలో స్పాంజ్ ఐరన్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఐరన్ ఓర్ని కబెట్టి స్పాంజ్ ఐరన్‌ని తయారు చేస్తారు. ఇది స్టీల్‌కు రా మెటీరియల్. గవర్నమెంటు పాలసీ వలన భారత దేశ వ్యాప్తంగా 240 ప్రైవేటు స్పాంజ్ ఐరన్ కంపెనీలు ప్రారంభమయ్యాయి. 2008లో అప్పటి ప్రభుత్వ చొరవతో స్పాంజ్ ఐరనన్ను ఎన్ఎమ్డిసిలో మెర్జ్ చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా 400 ఎకరాల స్పాంజ్ ఐరన్ భూమి, రన్నింగ్ ఫ్యాక్టరీలు, హైదరాబాద్ హెడ్డాఫీస్, రూ.50 కోట్ల లాభాలు ఎస్ఎమ్డిసిలో కలపడం జరిగింది. విస్తరణ కోసం ఏపీ స్టీల్ వారి వద్ద 100 ఎకరాల భూమి స్పాంజ్ ఐరన్‌లో కలుపుకోవడం జరిగింది. మెర్జింగ్ చేసిన సమయంలో రూ.1200 కోట్లతో పాల్వంచ ఎన్ఎమ్డిసిని అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు.
కాని, ఎన్ఎమ్డీసీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా పాల్వంచ యూనిట్ అభివృద్ధి కోసం ఖర్చు చేయలేదని తెలిపారు. మెర్జింగ్ చేసిన సమయంలో 199 మంది ఉద్యోగులు ఉండగా, క్రమక్ర మంగా పదవీ విరమణ పొందుతూ నేడు 65 మంది ఉద్యోగులు మాత్రమే మిగిలారన్నారు. పెట్టుబడి పెట్టి ఈ ఫ్యాక్టరీని అభివృద్ధి చేయకపోగా, ప్రైవేటు వారికి లీజుకి ఇవ్వడానికి టెండర్లు ఆహ్వానించింది. ఇది ఎంత వరకు సమంజసంమని ప్రశ్నించారు..? స్పాంజ్ ఐరన్ కర్మాగారన్ని ప్రైవేటుపరం చేయాలనే ఆలోచనను ఎన్ఎమ్డీసీ విరమించుకో వాలన్నారు. ఎన్ఎమ్డీసీ తన వైఖరిని మార్చుకోకపోతే ఫ్యాక్టరిని కాపాడుకునేందుకు సీపీఐ(ఎం), ప్రజా సంఘాల కార్మికులతో కలిసి ఐక్యంగా పోరాటాలు చేపడుతుందని స్పష్టంచేశారు.