Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అ సీఐటీయూ హమాలీ ఫెడరేషన్
రాష్ట్ర కార్యదర్శి సుధాకర్
నవతెలంగాణ-భద్రాచలం
జీసీసీ హమాలి కార్మికులు కరోనాను లెక్క చేయకుండా ప్రజలకు రేషన్ అందించటంలో కీలకమైన పాత్ర నిర్వహిస్తున్నారని, కరోనా వల్ల వారికి ప్రమాదం పొంచి వున్నందువలన ప్రతి హమాలి కార్మికుడికు రూ.50లక్షల ఇన్సూరెన్స్ సౌరక్యం కల్పించాలని సీఐటీయూ హమాలి ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం జీసీసీ హమాలి యూనియన్ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. సివిల్ సప్లై హమాలి కార్మికులకు అమలు చేస్తున్న పీఎఫ్, ఈయస్ఐ, జీసీసీ హమాలి కార్మికులకూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం జీసీసీ హమాలీల పట్ల శవతితల్లి ప్రేమ చూపుతుందని విమర్శించారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నందువలన కార్మికులకు కరోనా సోకితి ప్రభుత్వమే బాద్యత వహించి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
హమాలీలను నల్గొతరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన అన్నారు. జీసీసీ హమాలి యూనియన్ నాయకులు సుభ్రమణ్యం అధ్యక్షతన జరిగిన సమా వేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.బ్రహ్మాచారి, యూనియన్ జిల్లా కార్యదర్శి మ్నెగిళి, నాయకులు అశోక్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.