Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఆయన ఆశయ సాధనకోసం కృషి చేద్దాం
- అ యూఈఈయూ రాష్ట్ర సహాయ
- కార్యదర్శి అంకిరెడ్డి
- అ కిరణ్ 2వ వర్ధంతి సందర్భంగా
- కార్మికుల ఘననివాళి
నవతెలంగాణ-పాల్వంచ
విద్యుత్‌రంగ ఉధ్యమంలో అలుపెరుగని పోరాటం చేసి కార్మికుల జీవితాలకు వెలుగులు నింపిన మహనీయుడు ధృవతార కామ్రేడ్ కిరణ్ అని తెలంగాణ రాష్ట్రం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అంకిరెడ్డి నర్సింహరావు అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కార్మికులు అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎన్ కిరణ్ 2వ వర్ధంతి సందర్భంగా స్థానిక కేటీపీఎస్ ప్రాంతీయ కార్యాలయంలో కేటీపీఎస్ ఐదు ఆరు ఏడ దశల కమిటీ సభ్యులు ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్ ట్రాన్స్‌కో సీబీడీ గ్యాంగ్ కార్మికులు ఆయన చిత్రపటానికి పూలమా లలు వేసి ఘననివాళులు , విప్లవ జోహార్లు అర్పించారు. ఈ సందర్బంగా అంకిరెడ్డి నర్సింహా రావు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రెగ్యులరైజేషన్ కోసం నిరంతర ఉధ్యమాలు చేసినా ఒక మిలిటెంట్ ట్రేడ్ యూని యన్ నాయ కుడని కొనియాడారు. ఉధ్యమస్థానంలో సీఐటీయూ అంచలంచలుగా ఎదిగి విద్యుత్ ఉద్యోగుల ఫెడరే షన్ ఈఈఈఎఫ్వై అఖిలభారత కార్యదర్శిగా సీఐటీ యూ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా పనిచేశారని అన్నా రు. ఈ కార్యక్రమంలో సీనియర్ సీఐటీయూ నాయ కులు ఎం.సాంబశివరావు, నాయ కులు పత్తెం వెంక టేశ్వరరావు, నేతగాని రాజు, త్రినాధ్, తుమ్మల వెంక టేశ్వర్లు, పూర్ణ, సత్యనా రాయణ, కన్నయ్య, పిచ్చయ్య, దామర సత్యం, సంజీవరావు, నాయిబాబు, వెంకటేశ్వర్లు, వెంకన్న, వెంకన్న, నగేష్, ఉపేందర్, కె శ్రీను, అమజాత్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం : కిరణ్ ఆశయ సాధన కోసం ప్రతి కార్మికుడు కృషి చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్య దర్శి మంద నరసింహారావు అన్నారు. అమరజీవి కిరణ్ రెండవ వర్ధంతి సభ మాంచికంటి భవన్లో భూక్యా రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మంద నరసింహ రావు మాట్లడుతూ కిరణ్ పుట్టిన నాటి నుండి వామపక్ష భావాలు కలిగిన వ్యక్తిగా చైతన్య వంతంగా ఉండే వాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అన్నవరపు కనకయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్, యరగాని కృష్ణయ్య, కర్ల వీరస్వామి, జిబి. నాగరాజు, మండేలా మల్లి కార్జున్, విజరు, సతీష్, రామకృష్ణ, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా నాయకుల సిద్దెల రవి తదితరుల పాల్గొన్నారు.