Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అ వ్యకాస జిల్లా అధ్యక్షులు కృష్ణ
నవతెలంగాణ-సుజాతనగర్
అమాయకులైన గిరిజనుల జోలికి వస్తే ఊరుకునేది లేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జాటోత్ కృష్ణ హెచ్చరించారు. శుక్రవారం పాత అంజనాపురం గ్రామంలోని నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆదివాసీ గిరిజనులతో కలిసి జెండాలు పాతారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ తరతరాలుగా ఆదివాసీ గిరిజనులు ఈ ప్రాం తంలో నివసిస్తున్నారని, రెక్కాడితే డొక్కాడని పరిస్థితి వీరిదని అన్నారు. పాలకవర్గాలు ఆదివాసీ గిరిజను లను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా ఉపయో గించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కంటే ముందు ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీని తుంగలో తొక్కడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. మండలంలో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను సమగ్రంగా సర్వే జరిపి అర్హు లైన గిరిజనులకు పంపిణీ చేయాలని, తేకపోతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములను గుర్తిం చి భూములను ఆక్రమణ చేస్తామని హెచ్చరిం చారు. గిరిజనేతరులు ప్రభుత్వ భూమిని ఆక్రమిం చుకొని సాగు చేయడం మంచిది కాదని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వీర్ల రమేష్, మండల నాయకులు కాట్రాల తిరుపతిరావు, ఎస్.నాగరత్నమ్మ, ఎట్టి అమృత, బతు ్తల కళావతి, సత్యం, వెంకటేశ్వర్లు, దుర్గమ్మ, పాపమ్మ, తదితరులు పాల్గొన్నారు.