Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
కొంత కాలంగా బొగ్గుగని కార్మికుల పోరాటాల ఫలితంగా, గత స్టాండరైజేషన్ కమిటీ సమావేశంలో యూనియన్ల విజ్ఞప్తి మేరకు యజమాన్యం హౌలీ మినిస్ట్రీతో మాట్లాడిన మేరకు 11 వేతన కమిటీ వేయుటకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జేబీసీసీఐ సభ్యులు మంద నరసింహారావు తెలిపారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ (డీపీఈ) గైడెన్స్లోబడి చర్చలు జరుపుకోవాలని ఆదేశించింది. గతంలో డీపీఈ గైడ్ లైన్స్‌కు భిన్నంగా బొగ్గుగని కార్మికులు పోరాడి అదనపు వేతనం, ప్రయోజనాలు పొందడం జరిగిందన్నారు. 11వ వేతన ఒప్పంద చర్చల సందర్భంగా కూడా డీపీఈ గైడ్ లైన్స్‌ను పక్కన పెట్టి అధిక వేతనం, ప్రయోజనాలు పొందుటకు బొగ్గుగని కార్మిక వర్గం చైతన్యంతో ఉండాలని ఆయన కోరారు.