Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అ కరోనా సోకి న్యాయవాది మృతి
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.. శుక్రవారం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో 79 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 43 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్య అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో శుక్రవారం భద్రాచలం ు చెందిన ప్రముఖ న్యాయవాది భరణి శ్రీనివాస ప్రసాద్ (48) కరోనా సోకి మృతి చెందాడు. మృతుడు భరణి శ్రీనివాస్ ప్రసాద్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. భద్రాచలంలో న్యాయవాదిగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నభరణి శ్రీనివాస ప్రసాద్ మృతి చెందటం చాలా బాధాకరమని భద్రాచలం బార్ అసోసియేషన్ పేర్కొంది. అదేవిధంగా భరణి శ్రీనివాస ప్రసాద్ సీపీఐ నాయకులుగా పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. భరణి శ్రీనివాస్ ప్రసాద్ మృతి పట్ల సీపీఐ పట్టణ కమిటీ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేసింది.
భద్రాద్రిలో భయం.. భయం ..
భద్రాచలంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతుండటంతో పట్టణ వాసులలో భయాందోళన నెలకొంది. ఆర్టిసీ డిపో కండక్టర్‌గా పని చేస్తున్నా శ్రీనివాస్ కూడా కరోనా సోకి మృతి చెందిన విషయం విధితమే. ఇటీవల కాలంలో భద్రాచలంలో కరోనా సోకి మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో పట్టణ వాసులు తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది.