Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఎమ్డిసి ప్రాజెక్టు మేనేజర్‌కు సీఐటీయు వినతి
నవతెలంగాణ-పాల్వంచ
ఎన్ఎమ్డీసీ లీజు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఐటి యు డిమాండ్ చేసింది. ఈ మేరకు కర్మాగారం ప్రాజెక్టు మేనేజర్ ఎస్ బాబ్జిని కలిసి బుధవారం వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా సీఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎంవి అప్పారావు, ఎజే రమేశ్ మాట్లాడుతూ ఎన్ఎమ్డిసి (స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్) లీజుకు ఇవ్వకుండా ఐరన్ ఓర్ ప్రొడక్షన్ కాస్ట్‌కే ఇవ్వడం ద్వారా సంస్థ మనుగడ సాధ్యమని అన్నారు. 45 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడిన స్పాంజ్ఐరన్ని 2010లో ఎన్ఎమ్డిసిలో విలీనం చేసిన నాడు ప్రభుత్వం యాజమాన్యం ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని స్టీల్ కాంప్లెక్స్‌గా తీర్చిదిద్దుతామని చేసిన వాగ్దానం అమలు కాలేదని అన్నారు. 650 మందికి ప్రత్యక్షంగా ఉన్న ఉద్యోగాలు నేడు 70కి కుదించుకుపోయాయని గోదావరి, కిన్నెరసాని, నీళ్లు, బొగ్గు, కరెంట్ పుష్కలంగా ఉన్నప్పటికి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేయడానికే లీజు ప్రకటన చేసిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం యాజమాన్యం తక్షణమే లీజు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేని యెడల అన్ని పక్షాలను కలుపుకుని ఉధ్యమిస్తామని తెలిపారు. ప్రాజెక్టు మేనేజర్‌తోపాటు ఏజీఎం నాగరాజు నాయుడును కలిసిన వారిలో సీఐటియు జిల్లా అధ్యక్షులు ఎంబి అప్పారావు, కార్యదర్శి ఏజే రమేశ్, సిపిఐ ఎమ్ఎన్ న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు నిమ్మల రాంబాబు, స్పాంజ్ఐరన్ రవి, ఐఎన్టియుసి నాయకులు బాలునాయక్ ఉన్నారు.