Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నిరసన
నవతెలంగాణ-ఇల్లందు
ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులను, సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బుధవారం ఇల్లందు ప్రభుత్వ కళాశాల ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబీ మాట్లాడారు. వైద్యశాలలో కేవలం 11మంది సిబ్బందితో నడుస్తున్నది వెంటనే సిబ్బందిని నియమించాలని,18 ఏళ్ళు దాటిన వారందరికీ కరోనా వాక్సిన్ ఇండ్ల వద్దకు వెళ్లి వేయాలని, కరోనా పరీక్షలు అందరికీ చేయాలని, సంచార కేంద్రాలు గ్రామాలు, వార్డులలో ఏర్పాటు చేసి కరోనా పరీక్షలు, వాక్సిన్ లు వేయాలనే డిమాండ్ చేశారు లతో రెండోవ దశ అత్యంత ప్రమాదకరంగా ఉన్నదని, ప్రభుత్వం తన బాధ్యత విస్మరించి తూతూ మంత్రంగా అనాలోచిత లాక్ డౌన్ ప్రకటించిందని అన్నారు. ప్రజల అవసరాలు గుర్తించి ప్రభుత్వం పేద కుటుంబాలకు నెలకు రూ.7500, 50కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి తాళ్లూరి కృష్ణ, ఆలేట్ కిరణ్ పాల్గొన్నారు.