Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనుగోళ్లు ముమ్మరం చేయాలి : నడిపల్లి సునంద
నవతెలంగాణ-ములకలపల్లి
మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలుగా పేరుకుపో యిందని ములకల పల్లి పీఏసీఎస్ అధ్యక్షురాలు నడి పల్లి సునంద ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పీఏసీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కొనుగోళ్లపై అధికారులు స్పష్టత ఇవ్వక పోవడంతో రైతుల్లో అయోమయం నెలకొందని అన్నారు. గత నెల 17 న ములకలపల్లి సొసైటీ ద్వారా మండలంలో 10 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారన్నారు. కొంతకాలం వరకు కొనుగోళ్ళు సజావుగా సాగాయన్నారు. ఇప్పటివరకు పది సెంటర్ల నుంచి 90 లారీల ధాన్యంను మిల్లులకు పంపించారన్నారు. గత నాలుగు రోజుల నుండి లారీలు సక్రమంగా లేకపోవడం మూలంగా ట్యాగింగ్ చేసిన మిల్లర్లు ధాన్యం పంపవద్దు అని అడ్డంకులు సష్టిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రల్లో ధాన్యం రవాణా మందకొడిగా సాగుతున్నదన్నారు. ఇటీవల అకాల వర్షాల వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధాన్యం దిగుమతి చేసుకొనే మిల్లులకు మాత్రమే ట్యాగింగ్ చేయవలసినదిగా జిల్లా అధికారులను కోరారు. తక్షణమే రవాణా సౌకర్యాలలో ఉన్న ఇబ్బందులను తొలగించి తగు చర్యలు తీసుకోవలసినదిగా కోరారు.