Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫీవర్సర్వేలో 3లక్షల 25 వేల ఇండ్లు సర్వే
- జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవి.రెడ్డి
నవతెలంగాణ-కొత్తగూడెం
కోవిడ్ రోగుల పట్ల ప్రజలు వివక్ష చూపొద్దని, వారిని మానసిక క్షోభకు గురిచేయకుండా స్వాంతన కలిగేల పలకరించాలని, జిల్లాలో ఇటీవల నిర్విహించిన ఫీవర్సర్వేలో 3లక్షల 25 వేల ఇండ్లు సర్వే చేశామని, కోవిడ్ రోగులకు జిల్లాలోని అన్ని అసుపత్రులలో సేవలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవి.రెడ్డి తెలిపారు. బుధవారం క్యాంపు కార్యాలయం నుండి. వైద్య, కోవిద్ కేంద్రాల నోడల్ అధికారులు, జడ్నీ, డిఆర్డిఓ, డిపిఓ, మున్సిపల్, తహసిల్దారులతో ఇంటింటి సర్వే, వైద్యసేవలు, ఆక్సిజన్ వినియోగం తదితర అంశాలపై టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇంటింటి. ఫీవర్ సర్వే ప్రక్రియ నూరు శాతం పూర్తి చేశామని, జిల్లాలో ఉన్న 3 లక్షల 25 వేల ఇండ్లను జల్లెడ పట్టి జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్ళునొప్పులున్నట్లు గుర్తించిన 7300 మందికి హౌమ్ కిట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఇండ్లల్లో కిట్లు వాడుతున్న వ్యక్తుల్లో ఎంతమంది స్టెరాయిడ్స్ వాడుతున్నారో వారి ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని సర్వే టీములకు సూచించారు. ఇంటింటి సర్వే నిర్వహణలో ఏమైనా అనుమానాలున్నాయంటూ పలువురు సర్పంచులను, మహిళా సమాఖ్య, రైతుబంధు సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలోని 26 ఆసుపత్రుల్లో 755 ఆక్సిజన్, ఐసియూ పడకలు సిద్ధంగా ఉన్నాయని, అవసరాన్ని బట్టి పెంచేందుకు కూడా సంసిద్ధంగా ఉన్నామని, వైద్యసేవలకు ప్రజలు ఇబ్బంది పడకుండా. ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. బుధవారం వరకు 449 మంది ఆక్సిజన్ వైద్య సేవలు పొందుతున్నారని చెప్పారు.ఐదు రోజులు దాటినా జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే జాప్యం చేయక తక్షణం సమీపంలోని వైద్యశాలకు తరలిస్తే అత్యవసర వైద్యసేవలు నిర్వహణకు వైద్యసిబ్బంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వ్యాధి లక్షణాలున్న వ్యక్తులకు ఆర్ఎంపిలు వైద్య సేవలు నిర్వహించొద్దని హెచ్చరించారు. చెకోపోస్టుల వద్ద 24 గంటలు పటిష్ట పర్యవేక్షణ ఉండాలని ఇతర రాష్ట్రాల ప్రజావాహనాలను అనుమతించొద్దని చెప్పారు. నిత్యావసరాలు సరఫరా చేయు వాహనాల్లో ప్రజలను రవాణా చేస్తే వాహనాలను సీజ్ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కె.వెంకటేశ్వర్లు, అనుదీప్, జడ్పీ సిఈఓ విద్యాలత, డిఆర్డీఓ మధుసూదనాజు, డిపిఓ రమాకాంత్, వైద్యాధికారులు శిరీష, ముక్కంటేశ్వరావు, సర్పంచులు, రైతుబంధు సభ్యులు, యంపిపిలు, జడ్పీటిన్లు తదితరులు పాల్గొన్నారు.