Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ ఐసీయూ బ్లాక్ ను ప్రారంభించాలి
- సీపీఐ(ఎం) పట్టణ కమిటీ డిమాండ్
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో తక్షణమే ఐసీయూ బ్లాక్ ను ప్రారంభించాలని సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో ఉన్న సమస్యలు కోవిడ్ రోగులకు అందుతున్న వైద్యం, ఇతర సౌకర్యాలపై సీపీఐ(ఎం) బృందం బుధవారం సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా సిపిఎం భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి మాట్లాడుతూ భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు 140 బెడ్స్ తో కోవిడ్ ఐసోలేషన్ వార్డు ఉండగా 84 మంది రోగులు వైద్యం పొందుతున్నారని పేర్కొన్నారు. వారందరికీ ఆక్సిజన్ సౌకర్యం అందించడం జరుగుతుందని కానీ క్రిటికల్ సమస్య వచ్చినప్పుడు వైద్యం అందించడానికి కావలసిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ) లేకపోవటం తీవ్ర ఇబ్బందిగా ఉందని సర్వేలో వెల్లడైందని పేర్కొన్నారు. ఇన్వాయిస్ వెంటిలేటర్స్ 2 ,నాన్ ఇన్వాయిస్ వెంటిలెటర్స్ 5 హెచ్ .ఎఫ్ .ఎన్ .ఓ. 10 అవసరం ఉంటుందని సర్వేలో తేలింది అన్నారు. ఆక్సిజన్ ప్లాంట్ జనరేటర్ ప్రారంభం అయితే ఆక్సిజన్ కొరత ఉండదని, ప్రస్తుతం ఆక్సిజన్ లిక్విడ్ అందుతుందని డాక్టర్లు తెలిపారన్నారు. ప్రభుత్వ హాస్పటల్ లో వైద్యులు స్టాప్ కొరత తీవ్రంగానే ఉందని ప్రస్తుతం 12 మంది డాక్టర్లు 16 మంది స్టాఫ్ నర్స్ మాత్రమే ఉన్నారని సర్వేలో తేలిందని అన్నారు. తక్షణమే కావాల్సిన వైద్యులు, స్టాఫ్ నర్సుల పోస్టులు భర్తీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కమిటీ సభ్యులు సిహెచ్ మాధవరావు ,ఎన్. నాగరాజు లు పాల్గొన్నారు.