Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-అనవసరంగా ప్రజలు బయటికి రావొద్దు : డీఎస్పీ
వెంకటేశ్వరబాబు
నవతెలంగాణ-కొత్తగూడెం
లాక్ డౌన్ పటిష్టం అయింది. చిన్న చిన్న వ్యాపార, వాణిజ్యాలు మూత పడ్డాయి. సరిగ్గా 10 గంటలు కాగానే రోడ్డు మీదకు పోలీసు వాహనాలు చేరాయి. లాక్ డౌన్ విధులు చేపట్టారు. మొదటి రోజు కావడంతో లాఠీకి పని చెప్పడకుండా చూశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోవిడ్-19, కరోనా సెకండ్ వేవ్ లాక్డౌన్ పక్కగా కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం కొత్తగూడెం మెయిన్ రోడ్డులోని ఆన్ని రకాల వ్యాపారాలు రద్దీగా మారాయి. రంజాన్ పండుగ రానున్న తరుణంలో ముస్లీంలు పండుగ వస్తువులు కొనుగోలు చేయడం కనబడింది. ఉదయం 6 గంటల నుండి10 గంటల వరకు లాక్డౌన్ నిబంధనలు సడలింపు ఉండడంతో ప్రజలు కూరగాయ, నిత్యావసర వస్తువులు, రోడ్లమీద తినుబండారాలు కొనుగోలు చేశారు. కొత్తగూడెం ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రైవేటు దుకాణాలు, షాపులు, ఇతర వ్యాపారాలు 10 గంటలకే మూసివేశారు. సింగరేణి కార్మికులు వారి ఐడి కార్డు చూపించి కొలువులకు వెళ్లారు.
ప్రజలు బయటికి రావొద్దు....డిఎస్పీ వెంకటేశ్వరబాబు
ప్రజలు అత్యవసర పరిస్థితిలో మినహా ఎలాంటి పరిస్థితిలో ప్రజలు బయటికి రావద్దని కొత్తగూడెం డి.ఎస్.పి వెంకటేష్ బాబు స్పష్టం చేశారు. డిఎస్పీ నేతృత్వంలో లాక్డౌన్ పరిస్థితులు ఆయన పర్వవేక్షించారు. దూరప్రాంతాల వ్యక్తులు, ఇతర వాహనాలు వచ్చినప్పడు వాటిని పోలీస్ చెక్‌పోస్టుల వద్ద తదినిఖీలు చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ప్రధాన రహదారుల వెంబడి బారికేడ్లు ఏర్పాటు చేశారు.ప్రధాన సెంటర్స్ అయిన పోస్టాఫీస్, సింగరేణి హెడ్డాఫీస్, రామవరం గోధుమవాగు బిడ్జ్రి, చుంచుపల్లి బైపాస్‌రోడ్డు, లక్ష్మీదేవిపల్లి మెర్రెడు బిడ్జివద్ద, పట్టణంలోని త్రీ టౌన్ సూపర్ బజార్‌సెంటర్ వద్ద పట్టిష్టంగా వాహనాల తనిఖీలకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రజలు రోడ్లపై తిరగకుండా చర్యలు చేపట్టారు. పోలీస్ పెట్రోలింగ్ వాహనాల్లో తిరుగుతూ ఉదయం 10 గంటల తర్వాత ప్రజలు ఎవరు బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు.