Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
మండలంలో సంపూర్ణ లాక్డౌన్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్ఐ కొండలరావు కోరారు. స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్లో షాపుల యజమానుల ప్రజలతో బుధవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి పది రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించిందని, ఈ లాక్డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించి సహకరించాలని కోరారు. ఉదయం 10 గంటలకల్లా అన్ని రకాల షాపులను బందు చేయాలని వ్యాపారులను కోరారు. ఎమర్జెన్సీ వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతులు లేకుండా వీధుల్లోకి వచ్చిన వారిపై కూడా లాక్డౌన్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షాపు యజమానులు అందరూ మాస్కు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు. వివిధ షాపులు వద్దకు వెళ్లే ప్రజల కూడా మాస్కు ధరించాలని కోరారు. ఉదయం నుంచి మరల ఉదయం వరకు పోలీస్ పెట్రోలింగ్ వాహనం నిత్యం తిరుగుతుందని, ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఆయన వెంట ట్రైనీ ఎస్ఐ ఎం.సురేష్, పోలీస్ సిబ్బంది కృష్ణయ్య, సత్యంబాబు, ఎంఏ ఖదీర్, రమేష్ తదితరులు ఉన్నారు.