Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించిన
సత్తుపల్లి ప్రెస్‌క్లబ్
నవతెలంగాణ- సత్తుపల్లి
భయంకర కరోనా కష్టకాలంలో సైతం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వార్తలను కవరేజ్ చేసేందుకు సమాజాన్ని జాగృతం చేసేందుకు తమవంతు బాధ్యతగా విధులు నిర్వమిస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ప్రకటించాలని కోరుతూ సత్తుపల్లి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు వినతిపత్రం అందించారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే సండ్ర తప్పకుండా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ప్రకటించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రెస్‌క్లబ్ బాధ్యులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సండ్రకు వినతిపత్రం అందించిన వారిలో సత్తుపల్లి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు చీనేని బాలకృష్ణ, గౌరవ సలహాదారులు ఎండీ షైబుద్దిన్, గౌరవాధ్యక్షులు తోట కిరణ్, నాయకులు రుత్తల వెంకటేశ్వరరావు, నరుకుళ్ల రాము, యనమాల విజరు, పూరేటి శ్రీనివాసరావు, బల్లెం చిరంజీవి, కొర్ర బాలాజీ ఉన్నారు.