Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షులు దిండిగాల
నవతెలంగాణ-ఇల్లందు
భయంకరమైన రెండో వేవ్లోను కుటుంబాలను పక్కనపెట్టి ఎంతో శ్రమకోర్చి విధులు నిర్వహిస్తున్న నర్సులు మానవత్వం మూర్తులని వారి సేవలు వెలకట్టలేనిదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు దిండిగాల రాజేందర్ అన్నారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో బుధవారం నర్సులకు పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మరిని అరికట్టేందుకు నర్సులు అహౌరాత్రులు శ్రమిస్తున్నారు. బాధితులకు చికిత్స, సంరక్షణ అందిస్తున్నారు. మొహంపై చెరగని చిరునవ్వుతో, ఆప్యాయంగా పలకరిస్తూ ఎంతటి బాధలో నున్న వారికైనా ఓదార్పునిస్తున్నారు. ఈ అపత్కాల సమయంలో నర్స్‌లు బాధితులకు కొండంత అండగా వుంటున్నారు. ప్రస్తుత కరోనా వైరస్ కట్టడి చేసేందుకు వైద్యులతో పాటు నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి కంటికి కనిపించని వైరస్‌తో యుద్ధం చేస్తున్నారు. కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ వ్యాప్తంగా వేల సంఖ్యలో నర్సులు కంటి మీద కునుకు లేకుండా పని చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీరి సేవలు మానవత్వనికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు.ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సభ్యులు పులిగండ్ల మాధవరావు, తెలంగాణ ఉద్యమ నాయకులు ఇల్లందు మాజీ మండల ప్రధాన కార్యదర్శి డేరంగుల.పోశం టీఆర్ఎస్ పార్టీ ఇల్లందు యూత్ ప్రధాన కార్యదర్శి గిన్నారపు రాజేష్, టీఆర్ఎస్ నాయకులు పులిగండ్ల మాధవరావు తదితరులు పాల్గొన్నారు.