Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా బుధవారం మండలంలోని అశ్వారావుపేట(వినాయకపురం), గుమ్మడివల్లి ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలోని వైద్యారోగ్య సిబ్బందిని మండల పరిషత్ ఆధ్వర్యంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి పర్యవేక్షణలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ సేవలు అందిస్తున్న సిబ్బంది మన మండలంలో ఉండటం గర్వకారణమని అన్నారు. కరోనా వ్యాప్తి సమయంలో కోవిడ్ సోకిన వారి చెంతకు సొంత వారే దగ్గరకు రాకుండా పట్టించు కోకుండా వుండే పరిస్థితులూ ఇప్పుడు మనం చూస్తున్నాం అని ఆవేదన వ్యక్తం చేసారు. అలాగే గుమ్మడివల్లి ఆసుపత్రి సిబ్బందికి రైతు సమన్వయ సమితి నారాయణపురం అధ్యక్షులు చిన్నంశెట్టి లక్ష్మి నరసింహం రూ. 1000 ల విలువ గల పండ్లు బహుమానంగా ఇచ్చారు.అలాగే హాస్పిటల్స్లో ఉండి సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తహశీల్దార్ చల్లా ప్రసాద్, వి.ఆర్.ఒ వెంకటేశ్వరరావు, ఆయా గ్రామ సర్పంచులు,ఎంపీటీసీలు పాల్గొన్నారు.