Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండ్రుగొండ
గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాల వరకు నిరంతరం ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నర్సులను అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సులందరికీ మండల ప్రముఖులు, రాజకీయ నాయకులు, పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి ఉదృతంగా ఉన్న సమయంలో. కూడా ప్రజలందరికీ మేమున్నామంటూ ధైర్యం చెపుతూ వైద్యం నిర్వహిస్తున్న నర్సులందరికీ పాదాభివందనాలు అన్నారు. ఈ సందర్భంగా హెడ్ నర్స్ శంకరమ్మ మాట్లాడుతూ.. మేము ఎన్నో ఏళ్లుగా నర్సు వృత్తిని కొనసాగిస్తున్నామని అయినా కూడా ప్రజల్లో ఇంత ఆదరాభిమానాలు పొందలేక పోయామని అన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ ఉదృతంగా ఉన్న సమయంలో మా సేవలను గుర్తించి ఇలా మమ్మల్ని సన్మానించడం మరిచిపోలేని సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
వృత్తిని ఎంచుకున్నందుకు మేము గర్విస్తున్నానని కన్నీరు కారుస్తూ ఆనందభాష్పాలతో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ కొడకండ్ల వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ నరకుల్లా సత్యనారాయణ, ఎంపీటీసీ దారా బాబు, వార్డు సభ్యులు లింగం నాగేశ్వరరావు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ బోజ్యా నాయక్, జిల్లా నాయకులు సారేపల్లి శేఖర్, మండల నాయకులు కిరణ్ రెడ్డి, మల్లెం వెంకటేశ్వర్లు, మండల వైద్యాధికారి డాక్టర్ ఎస్ గీత. హౌమియోపతి వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఫార్మాసి లక్ష్మి, ఏఎన్ఎంలు, నర్సులు, గ్రామస్తులు పాల్గొన్నారు.