Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
జిల్లాలో అమలవుతున్న లాక్డౌన్ తీరును పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పోలీస్ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయం అవరణలో జరిగిన సమావేశం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి చోట విజబుల్ పోలిసింగ్ వుండాలని, జిల్లాలో లాక్ డౌన్ పకడ్భందిగా అమలు చేయాలని, పోలీస్ అధికారులు దీనిపై క్షేత్రస్ధాయిలో దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వం సడలింపు ఇచ్చిన అత్యవసర సర్వీసులకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకొవాలన్నారు. కూరగాయల మార్కెట్ , వ్యాపార, వాణిజ్య కేంద్రాలలో గుంపులు గుంపులుగా లేకుండా భౌతికదూరం పాటిస్తూ .. మాస్కులు ధరించేలా చొరవ తీసుకోవాలని సూచించారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ప్రజలు కూడా పోలీసులకు సహకారించాలని కోరారు. ఉదయం 10 గంటల సమయం నుంచి పికెటింగ్, చెక్ పోస్ట్ తనిఖీలు ముమ్మరం చేయాలని అన్నారు. పోలీస్ అధికారుల పర్యవేక్షణ వుండాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి ప్రజలు ఎవరు రోడ్డుపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ లా అండ్ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్, అడిషనల్ డీసీపీ( ఏఆర్) కుమారస్వామి, అడిషనల్ డీసీపీ ప్రసాద్, ఏసీపీలు ప్రసన్న కుమార్, రమేష్, వెంకటరెడ్డి, సత్యనారాయణ, జహాంగీర్, రామనుజం, విజయబాబు పాల్గొన్నారు.