Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చీఫ్ ఎల్ఐసీ అడ్వైజర్ లోడిగ వెంకన్నయాదవ్
నవతెలంగాణ- ఖమ్మం
అవును కరోన వైరస్ నడువలేదు....అయినా ఖండాంతరాలు దాటి అమెరికా, ఇటలీ, దుబాయి లాంటి 190 దేశాలు దాటి మన ఖమ్మం కూడా వచ్చేసిందని చీఫ్ ఎల్ఐసీ అడ్వైజర్ లోడిగ వెంకన్నయాదవ్ అన్నారు. ఎంతో ఆర్ధిక, ప్రాణ నష్టం కలిగిస్తున్న ఈ నడవలేని వైరస్ మన దగ్గరకు ఎలా వస్తున్నదని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించినా ఇది మన ఊరి లోకి, మన ఇంటిలోకి ఎలా వస్తున్నదని...కేవలం మన వల్లనే వస్తున్నదన్నారు. మన బాధ్యతా రాహిత్యం వల్లనే వస్తున్నదని..కరోన జబ్బుకు మందు లేదని..నివారణ ఒక్కటే మార్గం అని అన్నారు. ఒకరికి ఒకరు సామాజిక దూరం పాటించండి, ఇంట్లోనే వుండండి అని ప్రభుత్వాలు ఎంత చెప్పినా మనం వినకుండా బలాదూర్‌గా తిరగ టానికి రోడ్ల మీదకు వస్తున్నాం..తద్వారా ఈ వైరస్ ను ఒకరి ద్వారా మరొకరికి అంటిస్తున్నాం...నడవలేని ఈ వైరస్ ను నడిపిస్తున్నాం....దేశం దాటించి మన దేశం తీసుక వచ్చాము.... మన ఊరికి తీసుకొచ్చాం.....అభం శుభం తెలీని వారికి అంటిస్తున్నామన్నారు. ఎంతో మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాం. ఇదంతా చేస్తున్నది నిరక్షరాస్యులు కాదు...తెలివి తక్కువ వాళ్ళు ఏమి కాదు....కేవలం సామాజిక బాధ్యత లేనివాళ్ళు అన్నారు. దేశంలో లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారంటే మామూలు విషయం కాదన్నారు. .ఎన్నో ఆర్ధిక సామాజిక విషయాలతో ముడిపడివున్న ఈ నిర్ణయాన్ని మన నాయకులు తీసుకున్నారంటే దాని ప్రాముఖ్యాన్ని అర్ధం చేరుకోవాలన్నారు.
ప్రజల ప్రాణమే ముఖ్యం...దాన్ని కాపాడటమే మా ప్రధమ కర్తవ్యం ...దాని తరువాతే మరేదైనా అని మన దేశ, రాష్ట్ర నాయకులు నిర్ణయం తీసుకొని, మనలని ఇంట్లోనే వుండండి, బైటికి రాకండి, మీ కుటుంబాలను రక్షించుకోండి అని చెప్పారన్నారు. రెవిన్యూ, మునిసిపల్, పోలీస్, వైద్య, ఆరోగ్య, అంగన్ వాడి సిబ్బంది పగలు రాత్రి అని తేడా లేకుండా కరోన వ్యాప్తి జరగకుండా, కరోన సోకిన వారిని కాపాడటానికి, క్రొత్త వారికి సోకకుండా అహర్నిశలు కష్ట పడుతున్నారన్నారు. మనం రోజూ గమనుస్తున్నాం గుడులు, చర్చిలు, మసీదులు అన్ని మూత పడ్డాయని, కేవలం ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్ లు, మునిసిపల్ కార్యాలయాలు మాత్రమే తెరుచు కొని ఉంటున్నాయని,మనల్ని దేవుళ్ళు కాపాడలేరు, మీకు మీరే కాపాడుకోవాలి దానికి డాక్టర్లు,ప్రభుత్వ అధికారులు సహకరిస్తారన్నారు. ఇంటి వద్దకే నిత్యావసరాలు పంపిస్తున్నారన్నారు. వైరస్ ప్రమాదకరమైనది అని తెలిసి కూడా పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా విధి నిర్వహణ చేస్తున్నారన్నారు. దయచేసి కరోన కట్టడిలో అధికారుల సూచనలను పాటించండి... నడవలేని కరోనా వైరస్ ను నడిపించకండి... అమాయకుల చావుకు కారణం కాకండి ఇంట్లోనే వుండండి... సామాజిక దూరం పాటించండి... విధిగా మాస్కులు ధరించండి..తరుచు సబ్బుతో చేతులు కడుక్కోండి.వ్యక్తిగత శుభ్రత పాటించండి. రోడ్డు మీద ఉమ్మివేయకండి.. తుమ్మినా,దగ్గినా ఏదైనా కర్చీఫ్ లాంటిది అడ్డు పెట్టుకోండి..అనవసరంగా రోడ్ల మీదకు రాకండి అన్నారు. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే దాచకండి...వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చూపెట్టుకోవాలన్నారు.అలాంటి వారు ఎవరైనా ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.