Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అ బి. అశోక్, సర్కిల్ ఇన్స్పెక్టర్-చర్ల
నవతెలంగాణ-చర్ల
ఈనెల 22వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించినందు వల్ల ప్రజలు అందరూ ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు తమ పనులను ముగించుకుని తమ తమ ఇళ్లలోకి వెళ్లిపోవాలని సీఐ బి అశోక్ తెలిపారు. 10 గంటల తరువాత వ్యాపారస్తులు అన్ని దుకాణాలు మూసివేయాలన్నారు. మెడికల్ అవసరాల కోసం మాత్రమే బయట అనుమతి ఉందన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు మీదికి వస్తే వారి వాహనాలను సీజ్ చేసి ఆ వ్యక్తుల పైన కేసులు నమోదు చేస్తామన్నారు. ఉదయం 10 గంటల తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి వాహనాలను గాని, ప్రజలు కానీ రోడ్ల మీద అనుమతించమన్నారు. అత్యవసర అవసరం ఉన్న వాళ్ళు ఇతర జిల్లాలకు గాని, ఇతర రాష్ట్రాలకు వెళ్ళవలసిన వారికి పోలీసు పోర్టల్ జూశీశ్రీఱషవజూశీత్ీaశ్రీ.్రజూశీశ్రీఱషవ.స్త్రశీఙ.ఱఅ ద్వారా ఆన్లైన్లో ఈ పాస్లు అప్లై చేసుకొన్న వారికి పాసులు పోలీసు శాఖ ద్వారా జారీ చేయబడునని తెలిపారు. అధిగమించిన వారికి శాఖాపరమైన శిక్ష తప్పదని హెచ్చరించారు.