Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
మండల పరిధిలోని రావినూతల గ్రామంలో ముమ్మరంగా పారిశుధ్య పనులు శుక్రవారం చేపట్టారు. గ్రామంలోని ప్రధాన వీధులలో హైడ్రో క్లోరైడ్ ద్రావనాన్ని ట్రాక్టర్ ద్వారా పిచికారీ చేశారు. దీంతోపాటు గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా గ్రామమంతా ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ గ్రామ పంచాయతీకి సహకరించాలని కోరారు. గ్రామంలో రెండో దశ కరోనా వ్యాధి ఉధృతి కారణంగా గ్రామ ప్రజలందరూ కరోనా నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరు స్వీయనియంత్రణ పాటించాలని కోరారు. గ్రామంలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలని లేదా తమకు సమాచారం అందించాలని కోరారు. అందులో భాగంగానే గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చేబ్రోలు మల్లికార్జునరావు, పంచాయతీ గుమాస్తా మరీదు పుల్లయ్య, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.