Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.10వేలు ఆర్థిక సహాయం అందించాలి
అ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా
ప్రధాన కార్యదర్శి ముదాం శ్రీనివాస్
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా పనులు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక్కో కార్మికునికి పది వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదాం శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్ వద్ద తమ్మినేని సుబ్బయ్య భవనంలోని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో శుక్రవారం భవన నిర్మాణ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముదాం శ్రీనివాస్ మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల పనులు లేక కార్మికులు పస్తులు వుండవలసి వస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు దోనోజు లక్ష్మయ్య, జిల్లా వర్క్ ప్రెసిడెంట్ మేడికొండ నాగేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శి లింగయ్య, ఎర్ర మల్లికార్జున్, టి.వి రమణ, సీతారాములు, విశ్వనాథం పాల్గొన్నారు.