Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీస్ స్టేషన్లను సందర్శించిన పోలీస్ కమిషనర్
నవతెలంగాణ-ఖమ్మం
ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించే ందుకు కృషి చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో వైరా, తల్లాడ, కల్లూరు, వియం. బంజార, సత్తుపల్లి, వేంసూ రు పోలీస్ స్టేషన్ల పరిధిలోని బందోబస్తు, చెక్ పోస్టులు, పికెట్ ఏర్పాట్లను పరిశీలించారు. కమిషనర్ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్భందీగా లాక్ డౌన్ మార్గదర్శకాలు అమలు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆయా పోలీస్ స్టేషన్లను సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే వారి పట్ల వివక్ష చూపకుండా అందరికీ ఒకేవిధమైన గౌరవ మర్యాదలు అందేలా పారదర్శకతను విస్తరింప జేయడం పోలీసుల లక్ష్యంగా పనిచేయా లన్నారు. శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు కేసుల నమోదు విషయంలో తత్సారం చేయవద్దన్నారు.
కల్లూరు : కల్లూరు పోలీసు స్టేషన్ను పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అదే విధంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను పరిశీలించారు. పోలీసులకు లాక్డౌన్ను సమర్ధవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. లాగ్ డౌన్ సమయంలో శుభకార్యాలకు, అంత్యక్రియలకు, తప్పనిసరిగా రెవెన్యూ అనుమతి ఉంటేనే అనుమతించాలని ఆదేశించారు. అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా పోలీస్ పాస్ తీసుకోవాలని, తీసుకుంటేనే అనుమతించాలని ఆదేశించారు. లాక్డౌన్ సమయంలో ఉదయం 6గంటల నుండి పదింటివరకూ ప్రజలు బయటకు రావడానికి అనుమతించాలని, ఆ తర్వాత ఎవరైనా బయటకు వస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెనుబల్లి సీఐ కరుణాకర్, ఎస్సై ఎండి రఫీ, తదితరులు పాల్గొన్నారు.