Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు పౌల్‌రాజు
నవతెలంగాణ-భద్రాచలం
మైనర్ షారోను మృతికి కారకులైన వారిని శిక్షించాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పౌల్‌రాజు అన్నారు. శుక్రవారం ముఖ్య కార్యకర్తల సమావేశం భద్రాచలంలోని ఎంపీ కాలనీలో జరిగింది. ఈ ఆయన మాట్లాడుతూ బాలిక షారోన్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుద్రంపూర్ క్లబ్ ఏరియా టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి షారోన్ అనే బాలిక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆయన అన్నారు. క్లబ్ ఏరియాలో ఉంటూ ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న షారోన్ తండ్రి అయిన సైమన్ వారం రోజుల క్రితం ఇంటి ప్రహరి గోడ నిర్మాణం చేపట్టగా సంబంధిత సింగరేణి ఎస్టేట్ అధికారిని ఇది సింగరేణి స్థలం కాబట్టి ఈ స్థలం ప్రాంతంలో ప్రహరీ నిర్మాణం చేపట్టకూడదని సిబ్బందితో గోడకూలి నుంచి వేయడం జరిగిందని పేర్కొన్నారు. అక్కడ ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగితే సింగరేణి ఎస్టేట్ అధికారిని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇరువురిని పిలిచి సర్దిచెప్పి పంపించడం జరిగిందన్నారు. అంతటితో ఆగని సింగరేణి ఎస్టేట్ అధికారిని తన తండ్రి పనిచేస్తున్న ఆర్టీసీ డిపో మేనేజర్‌కు సైమన్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో కలత చెందిన షారోన్ తన తండ్రి ఉద్యోగానికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమోనని వేదనతో, ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన సుసైడ్ నోట్లో తన చావుకి ఎస్టేట్ అధికారి కారణం అని రాసి ఆత్మహత్యకు పాల్పడిందని ఆయన అన్నారు. ఇది గమనించిన చుట్టుపక్కల వాళ్ళు వెంటనే సింగరేణి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించడం బాధాకరం అన్నారు. కారకులైన వారిపై తగు విచార ణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొని, షారోన్ కుటుంబానికి న్యాయం చేయాలని కలెక్టర్ ఎం.వి రెడ్డి, జిల్లా ఎస్పీ సునీల్ దత్‌లను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జయరాజు, దుర్గారావు, యేసు, ఉదరు, కొండ, సాత్విక్, రాజేష్ పాల్గొన్నారు.