Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
కరోనా నిబంధనలు పాటిస్తూ ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలు జరుపుకున్నారని మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎండి.యాకుబ్ పాషా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రంజాన్ పర్వదినం పురస్కరించుకుని పండుగను జరుపుకున్నారు. 30 రోజుల కఠిన ఉపవాసాలు చేసి గురువారం నెలవంక కనపడటంతో శుక్రవారం పండుగ జరుపుకున్నారు. సామూహికంగా మసీదుల లో, ఈద్గాలలో ప్రార్ధనలతో జరుపుకోవాల్సిన పండుగను కరోనా కారణంగా ప్రభుత్వ అదేశాను సారం రెండేండ్ల నుంచి ఇంటివద్దనే జరుపుకుం టున్నట్టు తెలిపారు.
ములకలపల్లి : రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు నిరాడంబరంగా జరుపుకున్నారు. షుమారు వందేళ్ళ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇండ్లకే పరిమితమై ఈద్ జరుపుకోవడం ఇది రెండవసారి. ఈ సందర్భంగా జగన్నాధపురంలో ప్రముఖ రచయిత, జమాతె ఇస్లామి హింద్ జాతీయ సభ్యులు యం.డి.ఉస్మాన్ ఖాన్ మాట్లాడారు. సమాజంలో మానవుల మధ్య ప్రేమ, సమానత్వం, సోదరభావం, ఐక్యత, సామరస్యం, పరస్పర అవగాహన పెంపొందాలన్నారు. మానవుడి భౌతిక అవసరాలకోసం సృష్టిలో అనేక ఏర్పాట్లు చేసినదైవం, వారి పారలౌకిక సాఫల్యానికి ఖురాన్ ద్వారా మార్గదర్శనం చేశాడని, రమజాన్ మాసంలో నెలరోజులపాటు ఉపవాస దీక్షలతో కూడిన శిక్షణ ఇచ్చాడని చెప్పారు. మండల కో ఆప్షన్ సభ్యుడు జబ్బార్, జాఫర్, బాజీబాబా, అమీర్, బషీర్, సర్దార్, యాఖూబ్, జమాల్, షబ్బీర్, తదితరులు పాల్గొన్నారు.
అశ్వాపురం : మండల కేంద్రంలోని జమా మసీద్‌లో శుక్రవారం రంజాన్ పండుగ వేడుకలను సామాజిక దూరం పాటిస్తునే ముస్లింలు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా అల్లాకు ప్రార్ధనలు చేసారు. ఈ ఏడాది కరోనా ఉండటంతో ముస్లీం సోదరులు వారివారి ఇండ్లలోనే పండుగను జరుపుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ప్రార్ధనలు నిర్వహించారు.