Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
మంగపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కేసులు పెరుగుతుండటంపై జిల్లా వైద్యాధికారి శిరీష ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలో ఉన్న పీహెచ్సీని సందర్శించి వాక్సినేషన్ని పరిశీలించారు. కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న కారణంగా ప్రజలంద రూ మాస్కులు ధరిస్తూ తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని కోరారు.
శుక్రవారం మంగపేట పీహెచ్సీనీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శిరీష ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలో జరుగుతున్న హెల్త్ సర్వే గురించి వాకబు చేశారు. ఇప్పటివరకు మండలంలో 648 కరోనా కేసులు నమోదు అయ్యాయని ఇందులో 577 కేసులు రికవరీ అయ్యాయన్నారు. ప్రస్తుతం 178 కేసులు అక్టీవ్లో ఉన్నట్టు, 6 మరణాలు సంభవించినట్టు స్థానిక వైద్యాధికారులు విజయలక్ష్మి, అనిత తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ శ్రీకృష్ణ ఉన్నారు.