Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ కారణంగా సింగరేణి ఏరియా కాంట్రాక్ట్ కార్మికుల విధుల రాకపోకలకు డ్యూటీపాస్‌లు మంజూరు చేయాలని ఇప్టూ ఆధ్వర్యంలో డీజీఎం పర్సనల్ సలగల రమేష్‌కి వినతి పత్రం అందదజేశారు. ఈ సందర్భంగా ఇప్టూ నాయకులు నాసర్‌పాషా మాట్లాడుతూ... వివిధ డిపార్ట్మెంట్స్, గనుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు గ్రామాల నుండి ప్రతి రోజు పనిచేసే చోటుకి రాకపోకలు కొనసాగాల్సి వుంటుందన్నారు. వారి వద్ద పాస్‌లు లేని కారణంగా పోలీసులు అడ్డుకుంటున్నారని వారు తెలిపారు. వెంటనే కాంట్రాక్ట్ కార్మికులకు పాస్‌లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.