Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వాపురం
మండల పరిధిలోని జగ్గారం గ్రామ సమీపంలోని ఆరీఫా రోష్ని వృద్ధుల ఆశ్రమానికి శుక్రవారం మణుగూరు పికే ఓసి 2 సీకి చెందిన ముస్లీంసోదరులు రంజాన్ పర్వదినం సందర్భంగా క్వింటా భియ్యాన్ని వితరణగా అందజేసారు. అదేవిధంగా పాత్రికేయురాలు అనిత, లలిత్, కుమార్, ఏలిశెట్టి రూ.1000 ఆర్ధిక సాయాన్ని అందజేసారు. అనంతరం ఆశ్రమంలోని వృద్ధులతో కలసి సేమియా సేవించారు. ప్రతీ ఒకరూ ఎదుటివారి ఆకలిని తీర్చాలన్న ఆలోచన చేయాలని ఈ సందర్భంగా ఆమే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కె.నా సర్పాషా, మంగిలాల్, ఆశ్రమ నిర్వహకులు షహనాజ్, మెహరాజ్ పాల్గొన్నారు.