Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
మండలంలో గురువారం సంభవించిన అకాల వీదురుగాలులు, వర్షానికి దెబ్బతిన్న ధాన్యాన్ని శుక్రవారం ఎంపీపీ శ్రీరామమూర్తి నేతృత్వంలో మండల అధికారుల బృందం పరిశీలించింది. మండలంలోని ఆరు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించడం కోసం 15 రోజులుగా రాసులు పోసి ఎదురు చూసారు. నిబంధనల ప్రకారం కొనుగోలు ప్రక్రియలో జాప్యం జరగడం గురువారం అకాల గాలి-వానకు ధాన్యం రాసులు వర్షపు నీటితో తడిసి ముద్దయ్యాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ విషయాన్ని ఎంపీపీ కలెక్టర్ ఎం.వి రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. ఆయన ఆదేశాలు మేరకు వ్యవసాయ శాఖ అధికారులు, తహశీల్దార్ ఎంపీపీతో కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు న్యాయం చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షులు నూతక్కి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, ఊట్లపల్లి సర్పంచ్ సాధు జోత్స్నా భాయి, తహశీల్దార్ చల్లా ప్రసాద్, ఏఓ నవీన్, ఏఈఓ రాయుడు, తెరాస మండల కార్యదర్శి శ్రీను, రైతులు పాల్గొన్నారు.