Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు సింగరేణి ఏరియాలో రానున్న వర్షకాలపు ముందస్తు జాగ్రత్తలపై సమీక్షా సమావేశం నిర్వహించినట్టు జనరల్ మేనేజర్ జక్కం రమేష్ తెలిపారు. జీఎం కార్యాలయంలో ఉపరితల గనుల ప్రాజెక్ట్ అధికారులు, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బొగ్గు ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోసిస్తున్న ఉపరితల గనుల నుండి నిరాటకంగా ఉత్పత్తి కొనసాగినప్పుడే నిర్ధేశిత లక్ష్యాలను చేరుకోగలము అన్నారు. కావున రానున్న వర్షా కాలంలో ఆయా గనులు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలపై అధికారుల నుండి వివరాలు తీసుకున్నారు. క్వారీ రహదార్లపై వరదనీరు రాకుండా ఇరువైపుల లోతైన కాలువులు తీయించా లన్నారు. వర్కింగ్ స్థలం, డంపింగ్ యార్డులలో వరద నీరు నిల్వకుండా భారీ వాహనాలు సులువుగా, క్షేమంగా గ్రాండ్ లెవెల్ వర్కు చేయించాలన్నారు. క్వారిలోకి వరద నీరు రాకుండా మళ్లింపు చర్యలు చేపట్టాలన్నారు. వరదనీరుతో సంపులోని పంపులు మునిగిపో కుండా పక్క షేడ్లు ఏర్పాటు చేసి సురక్షి త ప్రాంతాలో వుంచాలన్నారు.
విద్యుత్ సంబంధిత స్వీచ్ బోర్డు లు, కేబుల్, తదితర వాటిని విద్యుత్ ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్ర మంలో ఏస్వోటు జీఎం లలిత్‌కుమార్, లకీëపతిగౌడ్, నాగేశ్వరరావు, నర్సిరెడ్డి, మధుబాబు, వరుణ్‌కు మార్, శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.