Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతకాని
రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని పీఏసీఎస్ అధ్యక్షులు కొండపల్లి శేఖర్ రెడ్డి కోరారు. శుక్రవారం సహకార సంఘం ఆధ్వర్యంలో రామకృష్ణాపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ పూర్ణయ్యతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కన్నెబోయిన కుటుంబరావు, ఎంపీపీ పూర్ణయ్య, వైస్ ఎంపీపీ హనుమంతరావు, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పుల్లయ్య, ఏఈ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.