Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
కోవిడ్-19 రెండవ దశ కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతున్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్ డౌన్ మార్గదర్శకాలను అమలు చేస్తూనే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న లాక్ డౌన్ శుక్రవారం మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కోవిడ్-19 మండల టాస్క్ ఫోర్స్ అధికారులకు ఆయన కరోనా నివారణ చర్యల్లో భాగంగా పలు సూచనలు చేశారు. ఏఏ గ్రామంలో ఎన్ని కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయో వారి వివరాలతో పాటు వారి ఫోటోలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజు వారిని పర్యవేక్షిస్తూ 14 రోజుల పాటు హౌం క్వారంటైన్లో ఉండేలా చూసే భాద్యత ప్రభుత్వ అధికారులుగా ప్రతి ఒక్కరి పై ఉందన్నారు. చిన్ననల్లబల్లి గ్రామంలో జరగాల్సిన వారాంతపు సంత సైతం నిలిపి వేసినట్టు ఆయన తెలిపారు. లాక్ డౌన్ మండలంలో పకడ్బందీగా అమలు అవుతుందని నిబందనలు ఉల్లఘించిన పలువురు దుకాణాదారుల పై కేసులు నమోదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.