Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల పరిధిలోని చిన్ననల్లబల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల ఇంద్ర కాలనీలో శుక్రవారం సీసీ రహదారి పనులను ప్రారంభించారు. పూనెం బాపనయ్య ఇంటి నుంచి సున్నం భద్రయ్య ఇంటి వరకు సుమారు 265 మీటర్ల మేర గ్రామ పంచాయతీ నిధుల నుంచి రూ.10లక్షలతో నూతన సీసీ రోడ్డు పనులను చిన్ననల్లబల్లి సర్పంచ్ మిడియం జయమ్మ, ఎంపీటీసీ తునికి సీతలు పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిన్ననల్లబల్లి ఉపసర్పంచ్ దండుగుల లక్ష్మణ్, వార్డు సభ్యుడు మడకం శ్రీనివాస్, మహిళా సంఘం సభ్యురాలు అనసూర్య, టీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు తునికి కామేష్, మాజీ ఎంపీటీసీ శిలువ కుమార్ తదితరులు పాల్గొన్నారు.