Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
లాక్ డౌన్ అమల్లో ఉన్న నేపధ్యంలో భద్రాచలంలో రెండు పూటలా యాచకులకు, నిరుపేదల కు, వలస కార్మికులకు ప్రతి రోజు రాత్రిపూట భోజన సదుపాయాన్ని శుక్రవారం నుంచి జేడీ ఫౌండేషన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. రామాలయం వద్ద సుమారు 25 మంది యాచకులకు, నిరుపేదలకు భోజనంను పార్సిల్స్ రూపంలో అందజేస్తున్నట్టు భద్రాచలం జేడీ ఫౌండేషన్ బాధ్యులు కె.మురళీమోహన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కంభంపాటి సురేష్, సీనియర్ పాత్రికేయులు కోన ఆనంద్ కుమార్ శర్మ, పివి సత్యనారాయణ, శ్రీపాద శ్రీధర్, పద్యక్షాత స్టోర్స్ సుధాకర్, హన్ని తదితరులు పాల్గొన్నారు.