Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల వాసులను అబ్బురపరుస్తున్న ఆర్టిస్ట్ అఖిల్
నవతెలంగాణ-ముదిగొండ
ముదిగొండ మండలానికి చెందిన ఆర్టిస్ట్ మాణిక్యం అఖిల్ ప్రతిసారి ఏదో ఒక ప్రత్యేకమైన కళని ప్రదర్శించి మండల వాసులని ఆకట్టు కుంటున్నాడు. ఈ సారి కూడా అదే కోవలో ఇంజనీరింగ్ పెన్‌తో చుక్కలతో మనుషుల ముఖ చిత్రాలను గీసి అందరిని అచ్చర్య పరుస్తున్నాడు. అందులో ముఖ్యంగా తన అక్క అలేఖ్య చిత్రం కోసం 13 గంటలు కష్టపడి వేసినది, చెల్లి అర్పిత కోసం కోసం 9 గంటలు కష్టపడి వేసినవి ఆ చిత్రాలను చూపరులను ఆకట్టుకున్నాయి. అదేవిధంగా తన ఫ్రెండ్ నిర్మల్ వాళ్ల చెల్లి పెండ్లికి ఇచ్చిన గిఫ్ట్, ముదిగొండ గ్రామానికి చెందిన రహీమ్, తన సతీమణి చిత్రం మండల వాసులను మంత్ర ముగ్దలని చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం ఆర్టిస్ట్ అఖిల్ మాట్లాడారు. కరోనా కష్టకాలంలో తన కల తనకి ఉపాధిని చూపించిందన్నాడు.