Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
మండల పరిధిలో మేడేపల్లి గ్రామంలో రెండో దశ కరోనా వేగవంతంగా వ్యాప్తి చెంది పాజిటివ్ కేసులు అధికమవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా ఉధృతిని కట్టడి చేసేందుకు గ్రామంలోనే సామినేని హేమంతరావు కళ్యాణ మండపం నందు శుక్రవారం ప్రజలకు ఎంపీపీ సామినేని హరిప్రసాద్ ఆధ్వర్యంలో కరోన నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సామినేని హరిప్రసాద్ మాట్లాడుతూ కరోనా వైరస్ సోకిన వ్యక్తులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి భౌతిక దూరం అమలుచేస్తూ శానిటైజర్‌ని వాడుతూ చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని ఇంటి పరిసరాల తోపాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు. కార్యక్రమంలో గ్రామసర్పంచ్ సామినేని రమేష్, ఉపసర్పంచ్ బి.రమేష్, వార్డ్ మెంబర్స్, సొసైటీ డైరెక్టర్స్, గ్రామపెద్దలు పాల్గొన్నారు.