Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బోనకల్ : మండల పరిధిలోని ముష్టి కుంట్ల ఎంపీటీసీ దంప తులు పిల్లలమర్రి మహేశ్వరి, నాగేశ్వర రావు కరోనాను జయిం చారు. ముష్టికుంట్ల ఎంపీటీసీ పిల్లలమ ర్రి మహేశ్వరి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు పిల్లలమర్రి నాగేశ్వర రావు ఇరవై రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. ఆ దంపతులు తెలిపిన వివరాల ప్రకారం నాగేశ్వరరావు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పని చేస్తున్నాడు. ఇరవై రోజుల క్రితం ఇద్దరికీ కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యుల సలహా మేరకు కొద్దిరోజుల పాటు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందారు. ఆ తర్వాత ముష్టికుంట్లలో హోంక్వారంటైన్లో ఉన్నారు. ఈ సమయంలో అనేకమంది తమకు ఫోన్లు చేశారని తెలిపారు. భార్య భర్తలు ఇరువురికి కరోనా రావటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందినట్లు తెలిపారు. వైద్యులు చెప్పిన విధంగా తాము వైద్య చికిత్స పొందటంతో పాటు స్వీయ నియంత్రణ పాటించామని దీని ఫలితంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన కోరుకుంటు న్నామని తెలిపారు. ప్రస్తుతం సాధారణంగానే ఆరోగ్యవంతంగా ఉన్నామని తెలిపారు. కరోనా వచ్చిన వారు ప్రధానంగా ఆందోళన పడవద్దని ధైర్యంగా ఉండాలని సూచించారు. దీంతోపాటు తప్పనిసరిగా మాస్కు ధరించాలని కరోనా బాధితులకు సూచించారు.