Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిబ్బంది అనారోగ్య సమస్యలను తెలపండి
- ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్
- సత్తుపల్లి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ
నవతెలంగాణ- సత్తుపల్లి
కరోనా విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ సత్తుపల్లి పోలీస్ అధికారులను కోరారు. శుక్రవారం సీపీ విష్ణు సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాల నిర్వహణ, రిసెఫ్షన్ విభాగం, సిబ్బంది వర్క్‌ప్లేస్, కౌన్సెలింగ్ తదితర విభాగాలను సీపీ పరిశీలించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన వానవ వనాన్ని పరిశీలించిన సీపీ విష్ణు సంతోషం వ్యక్తం చేశారు. పోలీస్ ఆవరణ పచ్చదనం, పరిశుభ్రతతో ఉండటాన్ని గమనించిన సీపీ సీఐ రమాకాంత్‌ను అభినందించారు. సిబ్బందికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే సీపీ కార్యాలయానికి సమాచారం అందించాలని కోరారు. అనంతరం బందోబస్ట్ తీరును సీసీ కెమెరాల ద్వారా సీఐ రమాకాంత్ సీపీకి వివరించారు. కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్, రూరల్ సీఐ కరుణాకర్, ఎస్సై రామునాయక్ పాల్గొన్నారు.