Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వగృహంలో ముస్లిం పెద్దలతో కలిసి నమాజ్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈద్ ముబారక్ తెలిపారు. ఖమ్మంలోని తన స్వగృహంలో శుక్రవారం కొద్ది మంది ముస్లిం మత పెద్దలతో కలిసి మంత్రి నమాజ్ చేశారు. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రార్థనలు కొనసాగాయి. నెల రోజుల పాటు అత్యంత నియ మనిష్టలతో ఉపవాస దీక్షలు చేస్తూ.. ప్రపంచ బాగు కోసం అల్లాV్‌ా ను ఆరాధించిన ప్రతి ముస్లిం సోదర, సోదరీమణులకు ధన్యవాదాలు తెలిపారు. మైనారిటీ వర్గాల అభ్యున్నతికి, ఆత్మగౌరవంతో తల ఎత్తుకునేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ బాటలు వేశారన్నారు. రంజాన్ పర్వదిన సంబరాలను ముస్లిం సోదరులు ఆనందోత్సాహాల మధ్య ఇళ్లలోనే జరుపుకోవడం గొప్ప విషయమన్నారు.
కార్యక్రమంలో సుడా డైరెక్టర్ ముక్తార్ షేక్, కార్పొరేటర్ మక్బూల్, మాజీ కార్పొరేటర్లు షౌకత్ అలీ, నాగుల్ మీరా, మత పెద్దలు తాజుద్దీన్, మజీద్, మస్తాన్, ఖయ్యూమ్, హకీం, ఖాసీం, సలీమ్, సాద్, సాజిద్, సలీమ్ , రియాసత్, రఫీక్, అజిజ్, సఫదార్రాజ్, అలీం, సుహైల్బేగ్, సమద్, ఇస్సాక్, ఫరీద్, హకీమ్, సుహైల్బేగ్, సమద్, ఇస్సాక్, ఫరీద్, హకీమ్, గఫ్పార్, అసిఫ్, ఫెరోజ్, కఫీల్లు పాల్గొన్నారు.