Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా
నవతెలంగాణ-రఘునాథపాలెం
మార్క్సిస్టు పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి, పార్టీ నిర్వహిస్తున్న పోరాటాలకు ఆకర్షితుడై రఘునాధపాలెం మండలం బూడిదంపాడు గ్రామానికి చెందిన ఫిజిక్స్ లెక్చరర్ కందుల అజయ్ కుమార్ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, నున్నా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. నున్నా నాగేశ్వరరావు పార్టీ కండువా కప్పి అజయ్ కుమార్‌ని పార్టీలోకి ఆహ్వానించారు. వారితో పాటు మరికొందరు యువకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నున్నా మాట్లాడుతూ... సమాజ మార్పు సీపీఐ(ఎం)తోనే సాధ్యమని అన్నారు. విద్యావంతులు సీపీఐ(ఎం)తో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో 35శాతం నిరక్షరాస్య జనాభా భారతదేశంలోనే ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అక్షరాస్యత వద్ధిలో చారిత్రక క్రమాలు ఆధారంగా 2025 నాటికి ప్రపంచంలో అత్యధిక మంది నిరక్షరాస్యులు భారతదేశంలోనే ఉంటారని అంచనా వేశారని వారు తెలిపారు. నూతన విద్యావంతులు సీపీఐ(ఎం) లో చేరడం అభినందనీయమనన్నారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి నవీన్‌రెడ్డి మాట్లాడుతూ... రాజకీయంగా చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాలో విద్యావంతులు రాజకీయాల్లో చురుకైన పాత్ర వహించాలన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రజల ప్రాణాలు తీస్తుంటే కేంద్ర ప్రభుత్వం కనీస చర్యలకు నోచుకోవడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ప్రభాకర్, ముత్తారావు, ప్రతాపనేని వెంకటేశ్వర్లు, సింగి ప్రవీణ్ కుమార్, హనుమంతు, శేషగిరి పాల్గొన్నారు.