Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జగ్గయ్యపేట హైవేలో కారు బోల్తా పడి ఖమ్మం జిల్లాకు చెందిన షైక్ అన్వార్ పాషా (26) దుర్మారణం చెందారు. సొంతంగా ఎస్కేఆర్ ట్రేడర్స్ ప్రియా సిమెంట్ డీలర్‌గా సొంత వ్యాపారం చేసుకున్నారు. ఇటు టీఆర్ఎస్వీ టౌన్ వైస్ ప్రసిడెంట్ గా చురుకుగా కొనసాగుతున్నారు. ఇతను తెరాస జిల్లా నాయకుడు ఎస్కే జిలాని తమ్ముడు. మృతి పట్ల మంత్రివర్యులు పువ్వాడ అజరు కుమార్, కార్పొరేటర్ షౌకత్ ఆలీ, మాగబుల్, విజన్, ప్రెసిడెంట్ సలీమ్, టీఆర్ఎస్వీ ప్రెసిడెంట్ సాద్, ముక్తార్, అశ్రీఫ్ తదితరులు భౌతిక గాయాన్ని దర్శించి నివాళ్లు అర్పించారు.