Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
ఖమ్మం రూరల్ మండలంలోని గూడూరుపాడు పంచాయతీ పరిధిలోని పిట్టలవారి గూడెం ప్రాంతంలోని ఓ గ్రానైట్ క్వారీ సమీపంలో శుక్రవారం భారీ స్థాయిలో మందుగుండు సామగ్రిని టాస్క్ఫోర్స్ పోలీసులు, రూరల్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులకు అందిన సమాచారం మేరకు గ్రానైట్ క్వారీ ప్రాంతంలో తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో అక్రమంగా నిల్వఉంచిన మందుగుండు సామాగ్రి పట్టుబడింది. వెంటనే పోలీసులు మందుగుండు సామాగ్రి సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన బాధ్యులు ఎవరు ఎక్కడి నుండి సరఫరా అవుతుందనే విషయలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పట్టుకున్న మందు గుండు సామగ్రికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.