Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి సమస్యకూ శాస్త్రీయ పరిష్కారం చూపేవారు
- విపత్కర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో నేర్పారు
- కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ప్రభుత్వాలు విఫలం
- ఆపత్కాలంలో ఉపకరిస్తున్న సీపీఐ(ఎం) ఐసోలేషన్ కేంద్రాలు
- పుచ్చలపల్లి 36వ వర్ధంతి సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా
- 'ఆన్లైన్' బహిరంగ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
భూమి, భుక్తి, విముక్తి' కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ముందుండి నడిపిన పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను పుణికిపుచ్చుకుని కమ్యూనిస్టులు ప్రజా సేవకు అంకితం కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ప్రతీ సమస్యకూ శాస్త్రీయ పరిష్కారం చూపే పుచ్చలపల్లి స్ఫూర్తితో కోవిడ్ లాంటి వైపరీత్యాల నుంచి ప్రజలు బయటపడేలా అండగా ఉండాలన్నారు. కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. శాస్త్రీయ దృక్పథంతో కోవిడ్‌ను అరికట్టకుండా మోడీ ప్రభుత్వం మూఢత్వపు ఆలోచనలు చేస్తుందన్నారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఆన్లైన్ బహిరంగ సభను ఉద్దేశించి తమ్మినేని మాట్లాడారు.
- డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్
నవతెలంగాణ-ఖమ్మం
ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి పట్ల ఎలా ఉండాలో వారిని కంటికి రెప్పలాగా ఎలా కాపాడుకోవాలో సుందరయ్య అనేక విపత్తుల సందర్భాల్లో చేసి చూపారని అందుకే ఆయన ఆదర్శ భావాలను నేటి యువతరం అలవరచుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ పిలుపు నిచ్చారు. బుధవారం స్థానిక సుందరయ్య భవనం లో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలతో వ్ఱేసి నివాళి అర్పించారు. అంనంతరం జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సభలో షేక్ బషీరుద్దీన్ మాట్లాడారు. 2017 మే 19 న సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించంటం అంటే ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళటం అని ఆయన పేరు మీద సంఘం జిల్లా కమిటి ఆధ్వర్యంలో ''పుచ్చలపల్లి సుందరయ్య గ్రంధాలయం''ను ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. ఈ గ్రంధాలయం ఆ రోజు నుంచి నేటి వరకు 2000 విప్లవ సాహిత్య పుస్తకాలు పంచడంతో పాటుగా పేద విద్యార్థులకు బుక్స్ పెన్నులు పంచటం జరిగిందన్నారు. బండారు రమేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్, జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి మేకల నాగేశ్వరరావు, సీఐటీయూ నాయకులు నవీన్ రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జిమ్మీ అశోక్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మా ముత్తారావు, జిల్లా సహయకార్యదర్శి పోలేపల్లి చరణ్య, జిల్లా నాయకులు కూరపాటి శ్రీను, రావులపాటి నాగరాజు, అశోక్, ప్రతాపనేని వెంకటేశ్వర్లు, కోండల్, వెంకన్నబాబు, మందుల ఉపేందర్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
అ కమ్యూనిస్టు గాంధీ పుచ్చలపల్లి
చింతకాని : భారత కమ్యూనిస్టు గాంధీగా పుచ్చలపల్లి సుందరయ్యను అభివర్ణించవచ్చని సీపీఐ(ఎం) చింతకాని మండల కార్యదర్శి మడుపల్లి గోపాల్ రావు పేర్కొన్నారు. పుచ్చలపల్లి ఆశయాలను కొనసాగిస్తూ వర్గ రహిత సమాజం సాధించడానికి అపర త్యాగాలకు, సుదీర్ఘ పోరాటాలకు కార్యకర్తలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) చింతకాని మండల కమిటీ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో పుచ్చలపల్లి సుందరయ్య 36 వర్ధంతిని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఘనంగా నిర్వహించారు. తొలుత బస్వాపురం గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం మండల పార్టీ కార్యాలయంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నాయకులంతా విప్లవ జోహార్లు అర్పించారు. అనంతరం ప్రొద్దుటూరులో జరిగిన సుందరయ్య వర్ధంతి సభలో మడిపల్లి గోపాల్ రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు వత్సవాయి జానకి రాములు పులి యజ్ఞనారాయణ ,గడ్డం రమణ, నాయకులు బిల్లా లక్ష్మయ్య, తూములూరి సత్యం పాల్గొన్నారు.
అ ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి
కామేపల్లి: ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్దంతిని కామేపల్లి మండలంలో సీపీఐ(ఎం) మండల కమిటీ ఆద్వర్యంలో జరుపుకున్నారు. జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి కృష్ణ సుందరయ్య చిత్రపటానికి పూలదండ వేసి ఘనంగా నివాళిర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప్పతల వెంకన్న పాల్గొన్నారు.
అ మధిరలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి
మధిర : కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సభను మధిర స్థానిక బోడేపూడి భవనం నందు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి సిపిఎం కార్యదర్శి నర్సింహారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి మంద సైదులు, టౌన్ కమిటీ సభ్యులు రాధాకృష్ణ, పడకంటి మురళీ , ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వడ్రాణపు. మధు, సిపిఎం నాయకులు వెంకట నర్సయ్య,లాలూ అమరయ్య తదితరులు పాల్గొన్నారు.
అ కారేపల్లిలో ఘనంగా సుందయ్య వర్ధంతి
కారేపల్లి : శ్రమ దోపిడీకి ఎదురు నిలిచి పోరాట బాణాన్ని ఎక్కుపెట్టిన మహానేత అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కే.నరేంద్ర అన్నారు. వీరతెలంగాణ విప్ల పోరాట రధసారధి పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్ధంతిని కారేపల్లి లో ఘనంగా నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసిన నివాళ్ళు అర్పించారు. ఈకార్యక్రమంలో నాయకులు ముండ్ల ఏకాంబరం, అన్నారపు కృష్ణ, శోభన్ వెంకటేశ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
అ ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి
ఎర్రుపాలెం : మండల కేంద్రమైన ఎర్రుపాలెం రామిశెట్టి పుల్లయ్య భవనంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కెవిపిఎస్ మండల నాయకులు సగుర్తి సంజీవరావు, బీసీ మండల నాయకులు నాగులవంచ వెంకట్రామయ్య, కోటి సుబ్బారెడ్డి, షేక్ బాబు, ఆవుల వెంకటేశ్వర్లు, తాళ్లూరి వెంకట నారాయణ, దేవరకొండ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
కల్లూరు : కమ్యూనిస్టు పార్టీ నిర్మిత పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్ధంతి సందర్భంగా సీపీఐ(ఎం) మండలం కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సుందరయ్య చిత్ర పటనికి ప్షులమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిపియం మండల కార్యదర్శి తన్నీరు కృష్ణార్జునరావు మాట్లాడారు. అనంతరం శాంతినగర్ లో కరోనాతో బాధపడుతున్న బాధితులకు పప్పులు, కూరగాయలు వారి ఇళ్లకు వెళ్లి పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మండల కార్యదర్శి తన్నీరు కృష్ణవేణి, గంప శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అ ఘనంగా సుందరయ్య వర్ధంతి
ఖమ్మం రూరల్ : దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్ధంతి మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవన్, తల్లంపాడు, కాచిరాజుగుడెం, ఆరేంపుల గ్రామాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు పొన్నెకంటి సంగయ్య, బందెల వెంకయ్య, పెరుమళ్ళపల్లి మోహన్ రావు, నందిగామ కృష్ణ, ఏటుకూరి ప్రసాద్ రావు,డాక్టర్ బత్తినేని రంగారావు, యామిని ఉపేందర్, పల్లె శ్రీనివాస్ రావు, మల్లయ్య, వట్టికోట నరేశ్, పెండ్యాల నాగేశ్వరరావు, కర్లపూడి వెంకటేశ్వర్లు, వేల్పుల శ్రీను, సతీష్, నరేందర్, అరవింద్, కోటి తదితరులు పాల్గొన్నారు.