Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నవతెలంగాణ-చింతకాని
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి కొర్రీలు లేకుండా తక్షణమే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బుధవారం చింతకాని మండల పరిధిలోని రాఘవాపురం, పాతర్ల పాడు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు కొనుగోలు కేంద్రాల్లో తేమ పేరుతో ఆరు నుంచి ఏడు కేజీలు తరుగు తీస్తున్నారని కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోడౌనుకు తరలించకుండా లారీలు రావడం లేదని రైతులు ఇబ్బందులను భట్టీ దృష్టికి తీసుకు వచ్చారు. తక్షణమే భట్టి విక్రమార్క అధికారులతో మాట్లాడి ఎటువంటి తరుగు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కాటాలు వేసిన బస్తాలను తక్షణమే తరలించాలని ఆదేశించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాఘవాపురం సర్పంచ్ కొండపర్తి గోవిందరావు, పాతర్ల పాడు ఎంపిటిసి బొర్రా ప్రసాదరావు, తహసీల్దార్ తిరుమలచారి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగార్జున పాతర్ల పాడు ఉప సర్పంచ్ తేలు కుంట్ల శ్రీను రైతులు పెంటాల అప్పారావు, కొల్లి గోవిందరావు, కంచుమర్తి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.